HYD: సికింద్రాబాద్లో బతుకమ్మ సంబరాల సన్నాహక సమావేశంలో మెట్టుగూడ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు భానుమతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు చేస్తూ వేడుకలకు వచ్చే మహిళలకు సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రత్యేకంగా తాగునీరు, వైద్య శిబిరాలు, పార్కింగ్ స్థలాలు, భద్రతా సిబ్బంది నియామకం వంటి అంశాలపై దృష్టి సారించాలని కోరారు.