AP: తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముత్యపు పందిరి వాహనంపై మలయప్పస్వామిగా తిరుమాడ వీధుల్లో శ్రీవారిని ఊరేగించారు. వజ్రాలు, ముత్యాలతో అలంకరించిన ఈ వాహనం చల్లదనానికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ వాహనంపై స్వామివారిని దర్శించుకుంటే భక్తుల మనస్సు నిర్మలమవుతుందని, పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
Tags :