ఆసియా కప్ 2025లో భాగంగా జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లలో చివరి పోరు భారత్, శ్రీలంక జట్ల మధ్య దుబాయ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగనుంది. కాగా ఇప్పటికే టీమిండియా ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకోగా చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి శ్రీలంక పరువు కాపాడుకోవాలని భావిస్తుంది.