VSP: హత్యాయత్నం కేసులో నిందితుడైన ముళకలపల్లి వెంకట నూకరాజుకు గాజువాకలోని 8వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయస్థానం ఆరేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎస్. కవిత శుక్రవారం తీర్పు వెలువరించారు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నూకరాజుపై హత్యాయత్నం కింద అభియోగాలు నమోదయ్యాయి. విచారణలో నిందితుడు దోషిగా తేలింది.