తూ.గో జిల్లాలో ఖరీఫ్ 2025-26 సీజన్లో 5.31 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అంచనా వేయబడగా, ఇందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి సేకరణ లక్ష్యంగా నిర్ణయించినట్లు జేసీ వై.మేఘా స్వరూప్ పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రిలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణపై సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అక్టోబర్ 10న 221 రైతు సేవా కేంద్రాలను ప్రారంభిస్తామన్నారు.