HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTRను తెలంగాణ భవన్లో మాగంటి సునీత కలిశారు. అభ్యర్థిగా తన పేరును ప్రకటించడంతో ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.