JGL: మల్లాపూర్ మండలం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పునఃప్రారంభించేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రత్యక్ష పర్యవేక్షణ చేశారు. కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు, చెరుకు రైతులతో సమావేశమై అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.