ప్రకాశం: గిద్దలూరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ధనలక్ష్మీ రూపంలో ప్రజలకు దర్శనమిస్తున్నారు. ఈ మేరకు కోటి 25 లక్షలు విలువచేసే నూతన కరెన్సీ నోట్లతో అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు అలంకరించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకుంటున్నారు.