E.G: కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత అధ్యక్షతన వారి కార్యాలయంలో ఇసుక ర్యాంపుల నిర్వాహకులు, స్టాక్ పాయింట్ నిర్వాహకులు, బోట్స్‌మెన్ అసోసియేషన్ సభ్యులతో ఇవాళ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇసుక రవాణాలో క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.