KRNL: పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ ఆఫీసులో MRO గీతా ప్రియదర్శిని ఇవాళ సచివాలయ ఉద్యోగులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ప్రియదర్శిని మాట్లాడుతూ.. మండలానికి మొత్తం 18,645 స్మార్ట్ కార్డులు వచ్చాయన్నారు. మొత్తం స్మార్ట్ కార్డులను మండలంలోని వివిధ గ్రామాల సచివాలయ ఉద్యోగులకు అందజేశామన్నారు. సచివాలయం ఉద్యోగులు రేషన్ డీలర్లను అనుసంధానం చేసుకొని పంపిణీ చేయాలని తెలిపారు.