SRCL: జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన జిమ్‌ను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శుక్రవారం ప్రారంభించారు. ఐడీఓసీలోని మొదటి అంతస్తులో జిమ్‌ను ఏర్పాటు చేయగా శుక్రవారం కలెక్టర్ ప్రారంభించి, జిమ్ పరికరాలను పరిశీలించారు. అనంతరం పలువురు ఉద్యోగులతో సరదాగా కాసేపు టేబుల్ టెన్నిస్‌ను ఆడారు.