TG: భాగ్యనగరంలో మూసీ ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఉస్మాన్ సాగర్ 15 గేట్లు, హిమాయత్ సాగర్ 11 గేట్లను అధికారులు ఎత్తారు. ఈ క్రమంలో MGBSను వరద ముంచెత్తింది. దీంతో అక్కడి పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. హైడ్రా, GHMC, విపత్తుల నిర్వహణ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రయాణికులెవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.