TPT: తిరుమలలోని రామ్ భగీచా-2లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో అశ్వినీ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కుసుమ కుమారితో కలిసి శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ మేరకు 50 మంది డాక్టర్లు, 60 మంది పారా మెడికల్ సిబ్బంది సేవలందిస్తున్నారన్నారు.