KMR: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పురస్కారాల ప్రధానం కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు KMR జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల శుక్రవారం తెలిపారు. దివ్యాంగుల సాధికారత కోసం విశిష్ట సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న పత్రాలను ఈనెల 12లోపు జిల్లా కలెక్టరేట్లో సమర్పించాలని కోరారు.