SKLM: హీరమండలం మండలం రెల్లివలస గ్రామంలో విద్యుత్ స్తంభాలు వేస్తుండగా జరిగిన ప్రమాదంలో కార్మికుడు బాణాల రాము (37) దుర్మరణం చెందాడు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఉర్లాం సబ్స్టేషన్ నుంచి స్తంభాలను ట్రాక్టరుపై నుంచి దించుతుండగా వాహనం ఒక్కసారిగా ఒరిగింది. దీంతో తోటి కార్మికుల చేతుల్లో ఉన్న స్తంభం జారి రాముపై పడటంతో అక్కడికక్కడే మృతి సంభవించింది.