TG: తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్-యుటా పారిశ్రామికవేత్తలకు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించేలా, దీర్ఘకాలిక విలువలు జోడించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇందుకు యూటా అనుకూలంగా స్పందించింది.