AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వైకుంఠ ద్వార దర్శనాలను డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజులపాటు కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గతంలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ఈసారి ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీని నియమించారు.