KMM: నేలకొండపల్లి మండలం కట్టు కాచారం వద్ద సోమవారం ఉదయం గ్రామస్థులు ధాన్యం లారీలను అడ్డుకున్నారు. ఆంధ్ర నుంచి సూర్యాపేట జిల్లాకు వందల సంఖ్యలో ధాన్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. తమ గ్రామం వద్దకు వచ్చిన కొందరు అధికారులు లారీల నుంచి డబ్బులు తీసుకుని, వదిలేస్తున్నారని గ్రామస్థులు తీవ్రంగా ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించాలని అన్నారు.