WNP: అమరచింత మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు జరగబోయే సర్పంచ్ ఎన్నికల నిర్వహణపై సోమవారం పీఓ (ప్రిసైడింగ్ ఆఫీసర్)లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను నియమించాలన్నారు. ఈ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ రవికుమార్ అధికారులను ఆదేశించారు.