VSP: శ్రీ సాయిదత్త మానస పీఠం ఆధ్వర్యంలో పీఠాధిపతి శ్రీ స్వామి సాయిదత్త లోకేశ్వరానంద మహారాజ్ పెందుర్తిలోని రెల్లి కాలనీ ఎంపీపీ స్కూల్లో విద్యార్థులకు 300 నోటు పుస్తకాలను సోమవారం ఉచితంగా పంపిణీ చేశారు. స్వామీజీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులో రాణించి దేశానికి దిశా నిర్దేశం చేయాలని కోరారు. పేద విద్యార్థులకు పీఠం తరఫున సహాయం అందిస్తునామన్నారు.