టికెట్ గొడవ ప్రాణం తీసింది. యూపీలో ఓ TTE కిరాతకానికి నేవీ ఆఫీసర్ భార్య ఆర్తి(30) బలయ్యారు. ట్రీట్మెంట్ కోసం ఢిల్లీ వెళ్తూ ఆమె పొరపాటున తప్పుడు ట్రైన్ ఎక్కారు. దీనిపై గొడవ జరగడంతో.. TTE ఆమెను లగేజీతో పాటు కదులుతున్న రైలు నుంచి బయటకి తోసేశాడని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేశారు. ఆమె స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.