TG: సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద చెట్లను తొలగించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాణ్యతలో ఏ మాత్రం రాజీపడొద్దని, నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దన్నారు. గద్దెల వద్ద వరద నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గద్దెల వద్ద నాలుగు వైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే, ఆలయం చుట్టూ పచ్చదనం అభివృద్ధి చేయాలన్నారు.