కేరళ సీఎం పినరయి విజయన్ నివాసానికి మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరువనంతపురంలోని ఆయన ఇంటికి చేరుకుని తనిఖీలు చేశారు. అలాగే ముంబై సింగపూర్ ఇంటర్నేషనల్ స్కూల్కు బాంబు బెదిరింపు రావడంతో పాఠశాలను ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. రెండు చోట్ల కూడా ఎటువంటి పేలుడు పదార్థాలు కనిపించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.