KDP: ప్రస్తుత రోజులలో జరుగుతున్న వాహన ప్రమాదాలపై బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ సంబంధిత శాఖ అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా పోలీసు, ఆర్టీసీ, ఆర్టీసీ, ఎంవీఐలతో మాట్లాడారు. మోటార్ వాహనదారులు అధిక వేగాన్ని నియంత్రించేలా చర్యలు చేపట్టాలన్నారు. బస్సులు కండిషన్లో ఉండేలా చూసుకోవాలని, వాహనదారులు మద్యం సేవించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.