MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం గ్రామంలో మార్క బుచ్చి రాములు ఇంటి ప్రక్కన మూలమలుపు వద్ద గేట్ వాల్ మరమ్మతు కోసం గ్రామపంచాయతీ సిబ్బంది కొద్ది రోజుల క్రితం గుంత తీసి పూడ్చడం మరిచారు. రాత్రి వేళలో ఈ గుంత కనిపించకపోవడంతో పెద్ద ప్రమాదం పొంచి ఉందని వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.