TG: విద్యుత్ శాఖను మొత్తం ఏపీ అధికారులతో నింపుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు.. ప్రభుత్వంపై మండిపడ్డారు. కీలకమైన బాధ్యతల్లో ఆంధ్రా అధికారులను నియమిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని తెలంగాణ వారు నడుపుతున్నారా? వెనకుండి ఏపీ వాళ్లు నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. ఏపీ అధికారులు, అవినీతితో రాష్ట్ర విద్యుత్ రంగం అస్తవ్యస్థమవుతోందన్నారు.