KRNL: పెద్దకడబూరులో మద్యం సేవించి వాహనాలను నడిపిన 5 మంది వ్యక్తులకు కోర్టు జరిమానా విధించినట్లు మండల ఎస్సై నిరంజన్ రెడ్డి సోమవారం తెలిపారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలో పట్టుబడ్డ వారిని ఎమ్మిగనూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి మద్యం సేవించి వాహనాలు నడిపిన 5మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు.