SRD: ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా జీవన్ రాథోడ్‌ను నియమిస్తూ.. రాష్ట్ర అధ్యక్షుడు సదానందం గౌడ్ సోమవారం తెలిపారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో నూతన ప్రధాన కార్యదర్శి జీవన్ రాథోడ్‌ను ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.