TG: స్థానిక ఎన్నికల పోరులో భాగంగా గ్రామాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్ధాపూర్లో.. గ్రామ ప్రజలతో అంజనేయ స్వామి గుడి ముందు సర్పంచ్ అభ్యర్థి ప్రమాణ చేయించారు. ఎలాంటి ప్రలోభాలకు, డబ్బుకు లొంగకుండా ఓటేయాలని ప్రజలతో ప్రమాణం చేయించారు. కాగా, ఇక్కడ రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.