KRNL: మద్యం బాబుల ఆగడాలను నివారించాలని ఆదోని పట్టణంలోని రెండో వార్డు కౌన్సిలర్ సురేష్, BJP జిల్లా మాజీ అధ్యక్షుడు నీలకంఠ సోమవారం ఒకటో పట్టణ సీఐ శ్రీరాములుకు వినతిపత్రం అందజేశారు. అక్కడ ఉన్న పాఠశాల మైదానంలో మద్యం బాబులు మద్యం సేవించి వీరంగం సృష్టిస్తున్నారని తెలిపారు. అంతేకాక సీసాలను పగులగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.