TG: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీని నమ్ముకుని కష్టపడిన కార్యకర్తలకు తప్పకుండా అవకాశం వస్తుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తామంతా ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవాళ ఖమ్మంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ఈ మేరకు మాట్లాడారు.