GNTR: ప్రజలు పోలీస్ శాఖపై నమ్మకంతో పెట్టుకున్న ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం గుంటూరు జిల్లా పోలీస్ వ్యవస్థ యొక్క ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుండి వచ్చిన పలు ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు.