సత్యసాయి: సీనియర్ జర్నలిస్ట్ కాలువ వెంకటరమణ అనారోగ్యంతో మృతి చెందడంపై మాజీ మంత్రి డా. పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లా సమస్యలపై ప్రజల తరఫున స్పందించిన రమణ మృతి బాధాకరమని వారు పేర్కొన్నారు. రమణ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారికి ఏప్పుడు అండగా ఉంటామని తెలిపారు.