KDP: దిత్వా తుఫాను నేపథ్యంలో శనగ పంటలు జాగ్రత్తలు తీసుకోవాలని లింగాల మండల ఏవో రమేశ్ రైతులకు సూచించారు. సోమవారం లింగాలలో రైతు సేవా సిబ్బందితో కలిసి ఆయన శనగ పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పంటకు వేరు కుళ్లు, మొదలు కుళ్లు తెగులు ఆశించే అవకాశం ఉందని, వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.