సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో నెలకు ఒక సినిమా విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపారు. ఈ బ్యానర్లో ప్రస్తుతం ‘అనగనగా ఒక రాజు’, ‘ఫన్‌కీ’, ‘సూర్య 46’, ‘ఎపిక్’ వంటి చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే, హీరో శ్రీవిష్ణు, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టితో కూడా నాగవంశీ చిత్రాలను నిర్మించబోతున్నారు.