GNTR: మోటార్ వాహనాల దొంగతనాలు, దారిదోపిడీల కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరాల నిర్మూలనకు బలమైన నిఘా ఏర్పాటు చేసినట్లు సౌత్ డీఎస్పీ భానోదయ తెలిపారు.