KMR: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు బాన్సువాడ RTC డిపో శుభవార్త చెప్పింది. శబరిమల క్షేత్రానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు బాన్సువాడ RTC డిపో మేనేజర్ రవికుమార్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో స్వాములతో కలిసి ఆర్టీసీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శబరిమల యాత్రకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు.