TG: మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా విభాగంలో ట్రాన్స్జెండర్లను నియమించింది. ప్రత్యేక శిక్షణ ఇచ్చి నియమించిన 20 మంది ట్రాన్స్జెండర్ సిబ్బంది మెట్రో స్టేషన్లలో విధుల్లో చేరారు. మెట్రో ప్రయాణికుల్లో మహిళలు సుమారు 30 శాతం మంది ఉండగా.. వారి భద్రత, సౌకర్యంపై మెట్రో యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుంది. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.