ADB: సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో SP అఖిల్ మహాజన్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకూడదని హెచ్చరించారు. స్టేజ్ ఏర్పాటు, వైద్య శిబిరం, పారిశుధ్యం, వంటి ఏర్పాట్లను ముందుగానే పూర్తిచేయాలని సూచించారు.