NZM: భీమ్గల్ పట్టణంలోని సరస్వతీ విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో గీతా జయంతి ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని, భగవద్గీతను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భగవద్గీత పారాయణం చేశారు.