కృష్ణా: నందివాడ మండలం వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా మానేపల్లి నాని సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కంపూడి రాజా చేతుల మీదుగా నాని అంగీకారపత్రాన్ని అందుకుని, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం వైసీపీ ఇంఛార్జ్ పేర్ని కిట్టు, జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.