NLR: ఉలవపాడులోని మసీదు ప్రాంతంలో ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఇంటింటికీ వెళ్లి నగదు పంపిణీ చేస్తూ, కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంతో పాటు కందుకూరు కూడా అభివృద్ధి చెందుతుందని, ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.