SRD: కంగ్టి మండలం జంగి (బి) గ్రామంలో బోగస్ ఓట్లను తొలగించాలని గ్రామస్తులు సోమవారం MRO, MPDOకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని కొందరి ఓట్లు స్థానిక గ్రామంలో, చౌకన్పల్లి గ్రామంలో డబుల్ పేర్లు ఓటర్ జాబితాలో ఉన్నాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఓట్లు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్న జాబితాలో పేర్లు రాలేవన్నారు.