కృష్ణా: ఈనెల 5న జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం(పేరెంట్–టీచర్స్ మీటింగ్) నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మూడవసారి మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.