KRNL: పెద్దకడబూరు మండలంలో JCBలను ఫైనాన్స్ కింద తీసుకొని చీటింగ్ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎమ్మిగనూరు DSP భార్గవి తెలిపారు. సోమవారం స్థానిక PSలో మీడియా ముందు నిందితులను ప్రవేశ పెట్టారు. సదరు ముద్దాయిలు దాదాపు 8 జేసీబీలను ఇలాగే మోసం చేసి, అడ్డదారిలో అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్నారు. నిర్మలా బాయి ఫిర్యాదు మేరకు జేసీబీలను స్వాధీనం చేసుకున్నారు.