GNTR: పొన్నూరులో జరగనున్న మెగా ఉద్యోగ మేళా పోస్టర్ను గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ. తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ మేళా డిసెంబర్ 13న వెలగా నాగేశ్వరరావు ఇంజినీరింగ్ కాలేజీలో జరగనుంది. విద్యార్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.