KDP: కడప నగరంలోని 35, 48, 5 డివిజన్లలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి పాల్గొన్నారు. ప్రతి నెల 1న ఉదయం నుంచే లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందించే విధానాన్ని కూటమి ప్రభుత్వం కట్టుదిట్టంగా అమలు చేస్తోందని ఆమె తెలిపారు. లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి పింఛన్లు అందజేశారు. వారి అవసరాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.