SKLM: ఎయిర్పోర్ట్ నిర్మాణంపై అపోహలు వద్దని పలాస ఆర్డీవో వెంకటేష్, ఎయిర్పోర్ట్ లీగల్ అడ్వైజర్ వెంకటేశ్వరరావులు సూచించారు. ఈ మేరకు సోమవారం మందస తహసీల్దార్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభావిత గ్రామాలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. గ్రామసభల్లో ఎయిర్పోర్ట్ వలన కలిగే లాభనష్టాలు చర్చిస్తామన్నారు.