NLG: చందంపేట మండలం పోలేపల్లి స్టేజ్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు గుంటోజు వినోదాచారి ఆధ్వర్యంలో ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేతావత్ లాలునాయక్ హాజరై మాట్లాడారు. బీజేపీ బలపరిచిన సర్పంచ్, వార్డ్ సభ్యులను అత్యధిక స్థానాలు గెలుపొందే విధంగా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.