NLG: చండూరు మండలం బోడంగిపర్తికి చెందిన గాలి జయకృష్ణ తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఇవాళ డాక్టరేట్ అందుకున్నారు. భాషాశాస్త్ర విభాగం నుంచి “తెలుగు వాక్యనిర్మాణం – మాండలిక భేదాలు” అనే అంశంపై ఆచార్య ఐనవోలు ఉషాదేవి పర్యవేక్షణలో చేసిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా జయకృష్ణను పలువురు అభినందిచారు.